161 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

by Sridhar Babu |
161 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, పెద్ద శంకరంపేట్ : పెద్ద శంకరంపేట మండలంలోని 161 జాతీయ రహదారిపై కొలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందాడు. మృతుని బంధువులు అందించిన వివరాల ప్రకారం అల్లాదుర్గ్ మండల్ అప్పాచిపల్లి తండాకు చెందిన వాడిత్య రమేష్ (23) ద్విచక్ర వాహనంపై శంకరంపేట వైపు వస్తున్న క్రమంలో హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్​ వైపు వస్తున్న కారు బైక్ ను అతివేగంగా ఢీకొనడంతో వాడిత్య రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన జరిగిన ప్రదేశానికి పోలీస్ సిబ్బందితో ఏఎస్ఐ విట్టల్ చేరుకొని విచారణ చేపడుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Next Story

Most Viewed