వినాయక విగ్రహాన్ని తీసుకువెళుతుండగా అపశృతి..

by Aamani |
వినాయక విగ్రహాన్ని తీసుకువెళుతుండగా అపశృతి..
X

దిశ,దుండిగల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే చంద్రగిరి నగర్ కు చెందిన 7 గురు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో టాటా ఏసీ ఎపి28టిడి 7583 వాహనంలో గండిమైసమ్మ నుండి చంద్రగిరి నగర్ కు వినాయక విగ్రహాన్ని తీసుకుని బయలుదేరారు. సూరారం లోని శివాలయం గుడి దగ్గరకు రాగానే అదే దారిలో వెళ్తున్న టీఎస్ 13 ఈ ఈ 1929 గల కారు అతివేగంగా వచ్చి టాటా ఏసీ వాహనాన్ని ఢీకొనడంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు ఎగిరి రోడ్డుపై పడడంతో భారీ గాయాలు అయ్యాయి,కారు నుజ్జునుజ్జు కాగా టాటా ఏసీ వాహనం సైతం బోల్తా పడింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సూరారం లోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు,కారు డ్రైవర్ అతివేగంగా వచ్చి బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు,బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సూరారం సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు,అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Next Story