రోడ్డు ప్రమాదం లో రైతు మృతి.....

by Disha Web Desk 11 |
రోడ్డు ప్రమాదం లో రైతు మృతి.....
X

దిశ, కందుకూరు(తుక్కుగూడ): కందుకూరు మండల కేంద్రంలో ఆదివారం టిప్పర్ ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రైతు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సీఐ మక్బూల్ జానీ తెలిపిన వివరాల ప్రకారం… కందుకూరు మండల కేంద్రానికి చెందిన రైతు కొమ్మగల బిక్షపతి (46) తన హోండా షైన్ నెంబర్ టీఎస్ 08 ఈఏఫ్ 4901 గల వాహనం పై కందుకూరు ఎక్స్ రోడ్ వైపు వెళ్తున్నారు. ఇదే సమయంలో కందుకూరు ఎక్స్ రోడ్ నుంచి కందుకూరు గ్రామం వైపు వెళ్తున్న మినీ టిప్పర్ వాహనం నెంబర్ టీఎస్ 08 యూఫ్ 6928 అతివేగంగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ను మేకల మండి వద్ద ఢీకొట్టింది.

ఘటనలో రైతు బిక్షపతికి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడే మృతిచెందినట్లు చెప్పారు. మృతుని భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన కోరారు. రోడ్డు ప్రమాద సమయంలో రైతు బిక్షపతి హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణపాయం తప్పేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ,నిబంధనలు పాటించాలని పోలీసులు తరుచుగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న వాహనదారులు మార్పు రావడం లేదన్నారు. నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపే వారిపై ఆర్టీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


Next Story

Most Viewed