- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
దిశ,దుగ్గొండి : అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మహ్మదాపురం గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. ఎస్సై పరమేష్, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పాలడుగుల రవీందర్ అలియాస్ రవి (52) వ్యవసాయం, ఫర్టిలైజర్ షాపు నడుపుతూ ఉండేవాడు. ఈ సంవత్సరం తనకున్న వ్యవసాయ భూమిలో పెట్టుబడితో మిర్చి పంట, పత్తి పంట సాగు చేశాడు.
తెగులు వచ్చి మిర్చి పంట దెబ్బతినగా, ప్రతికూల పరిస్థితుల్లో అనుకున్నంత దిగుబడి రాలేదు. ఫర్టిలైజర్ వ్యాపారంలో పెట్టుబడులతో అధిక మొత్తంలో నష్టం కలిగే వరకు అప్పుల అయ్యాయి. ఈ క్రమంలో చేసిన అప్పులు తీర్చలేనని తీవ్ర మనోవేదనకు గురైన రవీందర్ ఇంట్లో నీ పై అంతస్థులో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం నర్సంపేట లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందాడు. మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేష్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.