తాగిన మైకంలో బావ పై బామ్మర్ది రాయితో దాడి

by Kalyani |
తాగిన మైకంలో బావ పై బామ్మర్ది రాయితో దాడి
X

దిశ, బెజ్జూర్ : తాగిన మైకంలో బావపై బామ్మర్ది రాయితో దాడి చేసిన సంఘటన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం చిన్న సిద్దాపూర్ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. బెజ్జూర్ ఎస్సై విక్రం కథనం ప్రకారం, బెజ్జూర్ మండలం చిన్న సిద్దాపూర్ గ్రామానికి చెందిన ఆదే పురుషోత్తం 48 సంవత్సరాలను అదే గ్రామానికి చెందిన టా కిరే .వసంత్ అనే వ్యక్తి బండ రాయితో తల వెనుక భాగంలో కొట్టడంతో మృతి చెందినట్లు మృతుని భార్య శంకర్ బాయ్ చిన్న ఫిర్యాదు మేరకు వసంత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అదే పురుషోత్తంకు, టకిరే వసంతులు స్వయాన బామ్మర్ది తాగిన మైకంలో మానవత్వం మరిచి భావను బామ్మర్ది రాయితో కొట్టడంతో మృతి చెందినట్లు అతని భార్య శంకర్ బాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శవ పంచనామా నిర్వహించి, సిర్పూర్ టి ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు .. మృతునికి ఒక కుమారుడు శ్రీనివాస్, కుమార్తె ఉమా వతి ఉన్నారు.

Advertisement

Next Story