కన్న తల్లే హత్యకు కుట్ర చేసిందా?

by Sridhar Babu |
కన్న తల్లే హత్యకు కుట్ర చేసిందా?
X

దిశ, నిజామాబాద్ ప్రతినిధి : సభ్య సమాజం తలదించుకునేలా తన మైనర్ కూతురిని మట్టుబెట్టాలని ఓ కసాయి తల్లి చేసిన ఆకృత్యం వెలుగులోకి వచ్చింది. ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ శివారులోని నిజాంసాగర్ కెనాల్ ప్రధాన కాల్వ కట్టపై నిజామాబాద్ పట్టణానికి చెందిన మైనర్ బాలిక పై జరిగిన హత్యా యత్నం కేసులో బాధితురాలి తల్లి తో పాటు ఆటో డ్రైవర్ ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దాంతో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు సమాచారం. గురువారం ఉదయం జనకంపెట్ లోని

నిజాంసాగర్ కెనాల్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న 15 ఏళ్ల మైనర్ బాలిక ఘటన కలవర పరచింది. ఈ సంఘటనపై గ్రామ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా బాధితురాలి తల్లి తన ప్రియుడైన ఆటో డ్రైవర్ తో కలిసి ఈ దారుణానికి యత్నించిందని సమాచారం. దీంతో బాలిక తల్లిని, ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. తమ అక్రమ సంబంధానికి అడ్డు తొలగించు కోవడానికి బాలికను హత్య చేయాలని జానకంపేట్ గ్రామ శివారులోని నిజాంసాగర్ కెనాల్ కట్ట ప్రాంతంలోకి తీసుకొచ్చి బాలికపై తీవ్రంగా దాడి చేశారని, మెడకు ఉరివేయగా చనిపోయిందని భావించి అక్కడే వదలి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story