తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య

by Sumithra |
తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య
X

దిశ, వెల్దుర్తి : ఊరికనే డబ్బులు ఖర్చు చేస్తున్నావని తల్లి మందలించడంతో ఓ కూతురు ఎలకల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామయపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన రాపర్తి మేఘమాల (16) 10వ తరగతి చదువుకుంది. తల్లి స్వరూప, కూతురు మేఘమాలను గత నెల 21న ఇంట్లో పెట్టిన డబ్బులు ఏమయ్యా అంటూ ప్రశ్నించారు.

దీంతో తాను డబ్బులు తీయలేదని మేఘమాల తల్లితో ఘర్షణకు దిగింది. ఆ తరువాత తాను పొలం పనులకు వెళ్తున్నానని చెప్పిన మేఘమాల ఎలుకల మందు సేవించి ఇంటికి వచ్చి వాంతులు విరోచనాలు చేసుకుంది. ఏమైందని తల్లి ప్రశ్నించగా తాను ఎలుక ముందు సేవించినట్లు తెలపడంతో మేఘమాలను చికిత్స నిమిత్తం మెదక్ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. కాగా చికిత్స పొందుతూ మంగళవారం మేఘమాల మృతి చెందినట్లు ఎస్సై మధుసూదన్ గౌడ్ తెలిపారు. తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story