నిండు ప్రాణం మింగిన సెస్ అధికారులు

by Disha Web Desk 23 |
నిండు ప్రాణం మింగిన సెస్ అధికారులు
X

దిశ,ముస్తాబాద్ : సెస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైన ఘటన మండలంలోని కోదాటి వారి పల్లె లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోదాటి వారి పల్లె (నిమ్మల గడ్డ) కి చెందిన నిమ్మల ప్రభాకర్ (37) అనే వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున తన వ్యవసాయ పొలంలో వడ్ల మీద గడ్డి కోస్తున్నాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం సపోర్ట్ తీగ కు బొక్క బిగించక పోవడం వలన ఆ తీగ తగిలి ప్రభాకర్ మరణించాడని మృతుడి తండ్రి లింగయ్య ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన కుమారుడి మృతికి సెస్ అధికారులే కారణమని,వారి నిర్లక్ష్యం కారణంగానే ప్రభాకర్ మృతి చెందాడని బోరున విలపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed