CBI investigation : ట్రైనీ డాక్టర్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు షురూ..

by Kalyani |
CBI investigation : ట్రైనీ డాక్టర్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు షురూ..
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ డాక్టర్ హత్య కేసును ఛేదించడానికి సీబీఐ రంగంలోకి దిగింది. పశ్చిమ బెంగాల్ పోలీసుల దర్యాప్తు తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన కలకత్తా హైకోర్టు మంగళవారమే కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో బుధవారం ఉదయమే హూటాహుటిన సీబీఐ అధికారులు కలకత్తా చేరుకున్నారు. ఇప్పటివరకు కేసు దర్యాప్తు చేసిన కలకత్తా పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన సమాచారాన్ని, ఫైల్స్ ను సీబీఐ స్వాధీనం చేసుకున్నారు. కాగా కలకత్తాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్ పై జరిగిన, లైంగిక దాడి, హత్య సంఘటనపై అన్ని రాష్ట్రాల్లోని జూనియర్ డాక్టర్లు ఆందోళనలు నిర్వహించారు. సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా హామీతో తమ ఆందోళనలు విరమిస్తున్నట్లు మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed