తండ్రిని హతమార్చిన కసాయి కొడుకు

by Disha Web Desk 23 |
తండ్రిని హతమార్చిన కసాయి కొడుకు
X

దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ పట్టణ పరిధిలోని పూసాలలో కన్న తండ్రిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. రాయితో మోది హత్య చేసిన సంఘటన పట్టణంలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. వివరాల్లోకెళితే పట్టణ పరిధిలోని పుసాలలో నివాసం ఉంటున్న తీగల నర్సయ్య (65) అనే వ్యక్తిని అతని కుమారుడు తీగల రాజేశం(40) అతి కిరాతకంగా హత్య చేశాడు. పూసాలలోని ఐకేపీ సెంటర్లో తండ్రి తీగల నర్సయ్య ధాన్యం విక్రయిస్తుండగా తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ మొదలై ఈ హత్యకు దారి తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

కొడుకు రాజేశం తన తండ్రి నర్సయ్య ను నెట్టివేసి కిందపడిన తర్వాత ఆయన పై బండరాయి తో తల పై బాదాడు.దీంతో తల పగిలి నర్సయ్య అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విచారణ అనంతరం పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం నిమిత్తం సుల్తానాబాద్ తరలించారు. తన సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయేందర్ తెలిపారు.Next Story

Most Viewed