గోవాలో బస్సు బీభత్సం.. నలుగురు మృతి

by Mahesh |
గోవాలో బస్సు బీభత్సం.. నలుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: గోవాలో ఆదివారం ఓ బస్సు బీభత్సం సృష్టించింది. అత్యంత వేగంగా వచ్చిన బస్సు అదుపు కోల్పోయి.. రోడ్డు పక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గుడిసెలో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ గోవా జిల్లాలోని పారిశ్రామికవాడలో రోడ్డు పక్కన జాతీయ రహదారి పనులు చేసేందుకు వచ్చిన కూలీలు గుడిసెలు వేసుకున్నారు. వెర్నా ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద ఓ ప్రైవేటు కంపెనీ సిబ్బందితో వెళ్తున్న బస్సు కూలీలు నిద్రిస్తున్న రెండు గుడిసెల్లోకి దూసుకెళ్లింది. దీంతో అందులో నిద్రిస్తున్న నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బస్సు డ్రైవర్ ఆ స్థలంలో ఉన్న ఇతర కూలీలను బెదిరించాడని ఓ కార్మికుడు పేర్కొన్నాడు. కాగా ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు” అని బాధితుడు రూపేందర్ కుమార్ మాథుర్ పోలీసులకు తెలిపాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed