తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరి

by Sumithra |
తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరి
X

దిశ, కాగజ్ నగర్ : ఆసిఫాబాద్ పట్టణంలోని దస్నాపూర్ లో నివాసం ఉంటున్న మంచికట్ల రాజయ్య ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి చోరికి పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ వెంకటరమణ ఘటనా స్థలాన్ని పరిశీలించి చోరీకి సంబంధించిన వివరాలను బాధితుల నుండి తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ నిపుణులతో గాలింపుచర్యలు చేపట్టారు. బాధితులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం రాజయ్య రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్లారు.

శుక్రవారం మధ్యాహ్నం రాజయ్య, అతని కుటుంబ సభ్యులు వేములవాడ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులకు వేసి ఉన్న తాళం పగలగొట్టి కనిపించింది. ఇంట్లో బీరువాలోని బట్టలు, సామాగ్రి చిందర వందరగా పడి కనిపించడంతో దొంగతనం జరిగిందని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10 తులాల వెండి నగలు, రూ 50 వేల నగదును దొంగిలించినట్లు బాధితులు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ వెంట ఆసిఫాబాద్ టౌన్ ఎస్సైలు ఉన్నారు.Next Story

Most Viewed