బీజేపీ కార్యకర్తల వాహనంపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి..

by Disha Web Desk 13 |
బీజేపీ కార్యకర్తల వాహనంపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి..
X

దిశ, కామారెడ్డి క్రైమ్: బీజేపీ కార్యకర్తల వాహనంపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి చేసిన ఘటన కామరెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామారెడ్డి మండలానికి చెందిన బీజేపీ కార్యకర్తలు ఎల్లారెడ్డి సమావేశానికి వెళుతుండగా.. గర్గుల్ గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ర్యాలీ నడుస్తుంది. రోడ్డుపై రద్దీ ఎక్కువగా ఉండడంతో ఒక పక్కకు ఆపుకున్న బీజేపీ కార్యకర్తలకు చెందిన తుఫాన్ వాహనంపై ర్యాలీలోని కొందరు రాళ్లతో దాడి చేయడంతో అద్దాలు పగిలి అందులోని పలువురికి గాయాలయ్యాయి. ఈ విషయంపై దేవునిపల్లి ఎస్ఐ రాజు వివరణ అడగగా తమకైతే ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆయన పేర్కొన్నారు.

Next Story