BREAKING: రంగారెడ్డి జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో తండ్రి ఆత్మహత్యాయత్నం..?

by Shiva Kumar |
BREAKING: రంగారెడ్డి జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో తండ్రి ఆత్మహత్యాయత్నం..?
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్: ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని ఇనాంగూడలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీఎన్.రెడ్డి ప్రాంతానికి చెందిన అశోక్ అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇనాంగూడ చెరువు వద్దకు వచ్చాడు. అనంతరం పిల్లలను కారులో కూర్చొబెట్టుకుని డోర్లు అన్ని లాక్ చేసి చేరువులోకి తీసుకెళ్లి ఆత్యహత్య చేసుకునేందుకు యత్నించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేసి చాకచక్యంగా కారులో ఉన్న నలుగురిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Next Story