BREAKING: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే నలుగురు దుర్మరణం

by Shiva |
BREAKING: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: కారు కల్వర్టును ఢీకొనగా.. నలుగురు దుర్మణం పాలైన విషాద ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏడుగురు వ్యక్తులు కలిసి తిరుపతి నుంచి నెల్లూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కారు చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి శివారులోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డును పక్కనే ఉన్న కల్వర్టు గోడను అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరకి తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. కారులో ఇరుక్కుపోయిన ముగ్గురి మృతదేహాలు వెలికి తీస్తున్నారు. ఈ మేరకు గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

Next Story

Most Viewed