BREAKING: అనకాపల్లిలో ఇంజనీరింగ్ కాలేజీ బస్సు బీభత్సం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

by Shiva |
BREAKING: అనకాపల్లిలో ఇంజనీరింగ్ కాలేజీ బస్సు బీభత్సం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు బీభత్సం సృష్టించిన ఘటన అనకాపల్లి పరిధిలోని కసింపేట మండలం బయ్యవరం సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రోజు మాదిరిగానే ఓ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు కళాశాలకు బయలుదేరింది. ఈ క్రమంలోనే బస్సు కసింకోట మండలం బయ్యవరం సమీపంలోకి రాగానే రోడ్డు పక్కనే ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్‌పైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను అనకాపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed