బస్​ని ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం...యువతి మృతి

by Disha Web Desk 15 |
బస్​ని ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం...యువతి మృతి
X

దిశ, జూబ్లిహిల్స్ : రహదారి మధ్యలో బస్​ని ఓవర్ టేక్ చేస్తుండగా ఓ యువతి మృతి చెందిన ఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ ఐ రమా తెలిపిన వివరాల ప్రకారం.... ఖమ్మం జిల్లాకి చెందిన శిరీష (15 ) కుటుంబ సభ్యులతో కలిసి రహమాత్ నగర్ లో నివసి స్తున్నారు. శిరీష, ఆమె సోదరుడు కలిసి స్కూటీ పై యూసఫ్ గూడ నుండి కృష్ణనగర్ వెళ్తున్నారు. అదే క్రమంలో మెట్రో పిల్లర్ 1528 వద్ద బస్​ని, పక్కన ఉన్న వేరొక బైక్ని ఓవర్ టేక్ చేస్తుండగా పక్కన ఉన్న మరో స్కూటీ ఢీకొట్టడంతో ఆమె తలకి బలంగా గాయం కావటంతో అక్కడికక్కడే మృతి చేదింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed