నిత్యానంద స్వామి దేశంతో ఒప్పందం.. మంత్రి పదవి ఫట్

by Rajesh |
నిత్యానంద స్వామి దేశంతో ఒప్పందం.. మంత్రి పదవి ఫట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వివాదాస్పద స్వామీజీ నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా నిత్యానంద దెబ్బకు ఏకంగా ఓ దేశ మంత్రి పదవి ఊడిపోవడం చర్చగా మారింది. నిత్యానంద స్వామి ప్రస్తుతం ఓ చిన్న ద్వీపంలో కైలాస అనే సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కైలాస దేశంతో ఒప్పందం చేసుకున్నారన్న కారణంతో పరాగ్వే దేశానికి చెందిన వ్యవసాయ మంత్రి అర్నాల్డో చమర్రో తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ ఏడాది ఆరంభంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులు జెనీవాలో నిర్వహించిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికలపై కైలాస దేశ సార్వభౌమత్వానికి గుర్తింపు లభించేలా మద్దతు ఇస్తామని పరాగ్వే వ్యవసాయ మంత్రి అర్నాల్డో చమర్రోతో కైలాస ప్రతినిధులు ఓ ప్రకటనపై సంతకం చేయించుకున్నారు. దీనిపై పరాగ్వేలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యారు.

సోషల్ మీడియాలోనూ అర్నాల్డోపై విమర్శలు వ్యక్తం కావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా అర్నాల్డో స్పందిస్తూ.. అసలు తనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ఎక్కడుందో తెలియదని.. మౌళిక సదుపాయాలు, నీటి పారుదలకు సంబంధించి పరాగ్వేకు సాయం చేస్తామని కైలాస ప్రతినిధులు ముందుకు వచ్చారని దాంతో తాను వారికి మద్దతుగా ప్రకటన పత్రాలపై సంతకం చేశానన్నారు. కాగా నిత్యానంతకు చెందిన కైలాస ప్రతినిధులు అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్‌లోని నెవార్క్ నగర అధికారులను ఇదే తరహా మోసం చేసిట్లు ఈ నెవార్క్ నగర అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed