చేపల వేటకు వెళ్లి మృత్యువాత

by Disha Web Desk 23 |
చేపల వేటకు వెళ్లి మృత్యువాత
X

దిశ,మేడ్చల్ బ్యూరో : చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాద శాతం చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శామీర్పేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మండలం లో రాజ బొల్లారం గ్రామానికి చెందిన సంపత్ కుమార్ వృత్తి రీత్యా పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో సంపత్ తన స్నేహితుడు వెంకటేష్ తో కలిసి షామీర్పేట్ చెరువు కి చేపలు పట్టడానికి వెళ్ళాడు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు వెంకటేష్ మృతిని భార్య మమతకు ఫోన్ చేసి సంపత్ చెరువులో పడిపోయాడని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు షామీర్పేట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం సంపత్ షామీర్పేట్ చెరువు లో నుండి బయటకు తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్పేట్ పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed