అనూహ్య పరిణామం.. పోలీసుల కస్టడీలో ప్రైవేట్ పార్టు కోసుకున్న నిందితుడు

by Mahesh |
అనూహ్య పరిణామం.. పోలీసుల కస్టడీలో ప్రైవేట్ పార్టు కోసుకున్న నిందితుడు
X

దిశ, వెబ్ డెస్క్: పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు తన ప్రైవేట్ పార్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ అనూహ్య ఘటన రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అబ్దుల్ రషీద్‌ అనే వ్యక్తిని పోలీసులు ఆదివార రాత్రి అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. కాగా సోమవారం ఉదయం అతను టాయిలెట్‌కు వెళ్లాలని కోరగా కానిస్టేబుల్ ను ఇచ్చి పంపించారు. దీంతో అతను టాయిలెట్ లోకి వెళ్లి తన జేబులో ఉన్న రేజర్ బ్లేడ్‌తో తన ప్రైవేట్ భాగాలను కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతన్ని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం నిందితుని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. కాగా గతంలో కూడా ఇలాగే ప్రవర్తించిన నిందితుడు తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు.

Next Story

Most Viewed