యువకుల వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

by Kalyani |
యువకుల వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య
X

దిశ, మాడుగులపల్లి ; యువకుల వేధింపులు భరించలేక యువతి కొత్త కళ్యాణి తండ్రి రామలింగం ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన మాడుగులపల్లి మండలంలో కుక్కడం గ్రామంలో చోటుచేసుకుంది. మాడుగులపల్లి ఎస్సై జి శోభన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం… కుక్కడం గ్రామానికి చెందిన నిందితులు ఏ-1 అర్రూరి శివ తండ్రి శ్రీను, ఏ-2 కొమ్మనబోయిన మధు తండ్రి వెంకటయ్య, యువకులు గత కొంతకాలంగా వాట్సాప్ ఇంస్టాగ్రామ్ లలో యువతి ఫోటోలు స్టేటస్ పెట్టుకుంటామని నిందితులు ఆమెను వేధింపులకు కృషి చేశారు.

దీంతో మనస్థాపానికి గురై యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం గడ్డి మందు తాగగా చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి మంగళవారం సాయంత్రం సమయంలో మృతి చెందింది. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు మృతదేహన్ని అప్పగించడం జరిగిందని మాడుగులపల్లి ఎస్సై జి శోభన్ బాబు తెలిపారు. ఆమె తల్లి కొత్త రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మాడుగులపల్లి ఎస్సై జి శోభన్ బాబు తెలిపారు.

Next Story

Most Viewed