పండగపూట విషాదం..విద్యుత్ షాక్ తో యువకుడు మృతి..

by Sumithra |
పండగపూట విషాదం..విద్యుత్ షాక్ తో యువకుడు మృతి..
X

దిశ, నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో ఓ యువకుడు విద్యుత్ షాక్ తో మృతిచెందిన సంఘటన సోమవారం జరిగింది. పూర్తివివరాల్లోకెళితే గ్రామ శివారులో గల మెగా కంపెనీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను మహారాష్ట్రకు చెందిన నికేష్ ఆత్రమ్ (31)చేస్తున్నాడు. పనులను నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో ఆ యువకుడు మృతి చెందినట్లు నిజాంసాగర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

Next Story