ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి

by Disha Web Desk 23 |
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి
X

దిశ,కాల్వ శ్రీరాంపూర్: మండలంలోని మల్యాల గ్రామ పరిధి జగ్గయ్య పల్లి గ్రామానికి చెందిన ఉప్పుల దేవేందర్ 33 అనే యువకుడు సోమవారం రాత్రి కాల్వ శ్రీరాంపూర్ నుండి తన స్వగ్రామం జగ్గయ్య పల్లెకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. కాల్వ శ్రీరాంపూర్ గ్రామ శివారులోని పెట్రోల్ పంప్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి తీవ్ర గాయాలై పడిపోయాడు. రాత్రి సమయం కావడంతో ఎవరు గమనించకపోవడంతో దేవేందర్ అక్కడే మృతి చెందాడు. మంగళవారం ఉదయం గమనించిన వాహనదారులు మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతునికి భార్య జ్యోతి తో పాటు కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed