తాటి చెట్టును ఢీకొని యువకుడు మృతి

by Disha Web Desk 23 |
తాటి చెట్టును ఢీకొని యువకుడు మృతి
X

దిశ, జమ్మికుంట: పండగ పూట ఓ యువకుడు మేనత్త ఇంటికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం తాటి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన గంట అజయ్ (20) (అవివాహితుడు) అనే యువకుడు శుక్రవారం మేనత్త గ్రామమైన మాచనపల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో గ్రామ శివారులో మూలమలుపు వద్ద తాటి చెట్టుకు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఒక్కగానొక్క కొడుకు అకస్మాత్తుగా మృతి చెందడంతో తల్లిదండ్రుల, బంధువుల బోధనలో మిన్నంటాయి. పండుగ పూట అటు బోర్నపల్లి గ్రామంలో, ఇటు మాచనపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా మృతుడు అజయ్ ఎయిర్ టెల్ లో పనిచేస్తున్నట్లు బంధువులు తెలిపారు.


Next Story

Most Viewed