కడుపునొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య

by Disha Web Desk 23 |
కడుపునొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య
X

దిశ,సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన బొంకూరి.నరేష్ 25 సం తండ్రి రాజయ్య అవివాహితుడు. కడుపునొప్పి భరించలేక ఫిబ్రవరి 10 తారీకు రోజున సాయంత్రం పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన నరేష్ ను బంధువులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయగా పరిస్థితి విషమంగా ఉండడంతో ఈ నెల 19న హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుని తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజేందర్ తెలిపారు.


Next Story

Most Viewed