ఆస్తి కోసం తల్లిని చంపిన తనయుడు

by Kalyani |
ఆస్తి కోసం తల్లిని చంపిన తనయుడు
X

దిశ, చిన్నకోడూరు : ఆస్తి కోసం తల్లిని తనయుడు చంపిన సంఘటన మండల పరిధిలోని గంగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. చిన్నకోడూరు ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అంతగిరి మల్లయ్య కు ఇద్దరు భార్యలు. అంతగిరి పోచవ్వ, అంతగిరి సత్యవ్వ లు ( 65 ) సత్తవ్వ పేరున 5 ఎకరాల భూమి ఉంది. మంగళవారం రాత్రి సత్తవ్వ కుమారుడైన చంద్రశేఖర్ సిద్దిపేట నుండి గంగాపూర్ కు వచ్చి తల్లిని 5 ఎకరాల భూమి తన పేరున చేయాలని గొడవ పడినట్లు తెలిపారు. తన చెల్లె పోషవ్వకు ఇద్దరు కుమారుల అందరికీ సమానంగా ఆస్తిని చేస్తానని సత్యవ్వ అనడంతో చంద్రశేఖర్ పల్లి తో గొడవపడ్డాడు.

గొడవ అనంతరం చంద్రశేఖర్ తండ్రి మల్లయ్యకు తల్లి ఇంటి వెనకాల కాలుజారి పడిపోయి తలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపాడు. మల్లయ్య భార్య వద్దకు పోయి గమనించగా తలకు తీవ్ర గాయమైనట్లు తెలిసింది.108 ద్వారా సిద్ధిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు సత్తవ్వ చనిపోయిందని నిర్ధారించారు. బుధవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు. పోలీసుల విచారణలో మల్లయ్య తన భార్యను తన కొడుకే చంపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.Next Story

Most Viewed