కాలువలో పడి వ్యక్తి మృతి

by Sumithra |
కాలువలో పడి వ్యక్తి మృతి
X

దిశ, హవెళి ఘనపూర్ : ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన హవేలీ ఘనపూర్ మండలం సర్ధనలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు హవెళి ఘనపూర్ మండలం సర్ధనకు చెందిన కట్ట కిషన్ (55) పొలం వద్ద కాలువలో పెట్టిన బోరుమోటార్ రిపేర్ చేయడం కోసం పొలం వద్దకు వెళ్ళి నాడు. వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు మొబైల్ కు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చి వెళ్లి చూడగా కాలువలో శవమై పడి ఉన్నాడు. ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెంది ఉంటాడని స్థానికులు తెలిపారు. మృతునికి భార్య కట్ట దుర్గమ్మ ఉంది.

Advertisement

Next Story