పండుగపూట వెలుగు చూసిన దారుణ హత్య.. భార్యను చంపేసి..

by Nagaya |
పండుగపూట వెలుగు చూసిన దారుణ హత్య.. భార్యను చంపేసి..
X

దిశ, హుజూర్ నగర్: మద్యానికి బానిసైన ఓ భర్త.. భార్యను అతికిరాతంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో సోమవారం వెలుగు చూసింది.హుజూర్ నగర్ సీఐ రామలింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణానికి చెందిన భవాని రవి, కమల(30)దంపతులు. వీరికి ముగ్గురు అమ్మాయిలు,ఇద్దరు అబ్బాయిలు సంతానం. దంపతులు ఇద్దరు చిత్తు కాగితాలు,పాత ఇనుప సామాను ఏరుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే గత కొన్నాళ్లుగా రవి మద్యానికి బానిసై భార్య కమలపై దాడి చేస్తూ హింసిస్తున్నాడు. దీంతో భర్త టార్చర్ భరించలేక భార్య పలుమార్లు ఇంట్లో నుండి వెళ్ళి పోయే వచ్చేది. ఇదే మాదిరిగా గతమూడు వారాల క్రితం రవి కమలపై దాడి చేయడంతో ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది.

కాగా, ఈనెల 17న కమల కోదాడ పట్టణంలో భర్త రవికి కనిపించడంతో ఆమెను తన మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని హుజూర్ నగర్ పట్టణంలోని పాత వివేకవర్ధిని కాలేజీ వద్దకు తీసుకొచ్చాడు. అక్కడ కమలపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో భయపడిపోయిన రవి ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. సోమవారం మృతురాలి పెద్ద సోదరి తురాయి ఆమని ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రామలింగారెడ్డి తెలిపారు. మొదట సమాచారం అందుకున్న ఎస్సై హరికృష్ణ ఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.Next Story

Most Viewed