మొబైల్‌ దొంగిలించాడనే అనుమానంతో స్నేహితుడి దారుణ హత్య

by Disha Web Desk 1 |
మొబైల్‌ దొంగిలించాడనే అనుమానంతో స్నేహితుడి దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్ : మొబైల్‌ దొంగిలించాడనే అనుమానంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని దారణంగా హత్య చేసిన ఘటన జార్ఖండ్ లో రాణికుదుర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. అభిషేక్ అనే వ్యక్తి తన సెల్ ఫోన్ కనిపించకపోవడంతో అతడి స్నేహితుడు విశాల్ ప్రసాద్ దొంగిలించాడని అనుమానించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అభిషేక్ శనివారం ఉదయం విశాల్ ఇంటికి వెళ్లి తన మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వాలని వాగ్వాదానికి దిగాడు.

అయితే, విశాల్ ప్రసాద్ మొబైల్ ఫోన్‌ తాను దొంగిలించలేదని నమ్మించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి సమయంలో అభిషేక్ విశాల్‌కు ఫోన్ చేసి రాందాస్ భట్టా ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అతడిని విచక్షణా రహితంగా కొట్టాడు. అనంతరం అతడిని టాటా మెయిన్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న అభిషేక్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Next Story