మైనర్ బాలికపై అత్యాచారం నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

by Jakkula Mamatha |
మైనర్ బాలికపై అత్యాచారం నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. విశాఖ ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది ఏప్రిల్ నెలలో చోటు చేసుకున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. టిఫిన్ కోసం 9 ఏళ్ల బాలిక ఇంటి బయటకు వెళ్తే పొదల్లోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ తర్వాత ⁠ 20 ఏళ్ల జైలు శిక్ష తో పాటు నిందితుడికి 40వేల రూపాయలు జరిమానా విధించిన స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి ఆనంది తీర్పు చెప్పారు. బాధితుల తరపున వాదించి న్యాయం జరిగేలా చేసిన స్పెషల్ పీపీ కరణం కృష్ణకి ధన్యవాదాలు తెలిపారు.

Next Story