టోల్ గేట్ వద్ద 160 కిలోల గంజాయి స్వాధీనం..ఇద్దరు అరెస్ట్

by Mamatha |
టోల్ గేట్ వద్ద 160 కిలోల గంజాయి స్వాధీనం..ఇద్దరు అరెస్ట్
X

దిశ,ఏలూరు:ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్ గేట్ వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు గురువారం జరిపిన తనిఖీల్లో 10.50 లక్షల రూపాయల విలువైన 160 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఎస్ఈబీ అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఈ వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణా అడ్డుకునేందుకు ఎస్ఈబీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో ఏలూరు ఎస్.ఇ.బి.

స్టేషన్ దర్యాప్తు అధికారి, సీఐ కె. విద్యా సుధాకర్ ఎస్ ఐ పి. శివప్రసాద్, , జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది తో కలపర్రు టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. బరమతి గ్రామానికి చెందిన జమీర్ పింజరీ, మహారాష్ట్ర థానే జిల్లా బివన్ గ్రామానికి చెందిన అతిక్యూ అహ్మద్ వస్తున్న కారు ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కారులో 8 గోనె సంచులలో ఒక్కొక్క సంచిలో రెండు కిలోల ప్యాకెట్లు 10 లభ్యమయ్యాయి. ఎనిమిది సంచులలో మొత్తంగా 160 కేజీల గంజాయి ఉన్నట్లు కనుగొన్నారు. వెంటనే స్కార్పియో కారును, మొబైల్ ఫోన్ , గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ 10.55 లక్షలు ఉందని అధికారులు తెలిపారు . దీనికి సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

Next Story