నీకు నచ్చిన వాళ్లకే కప్పు ఇచ్చుకో ఓటింగ్ ఎందుకు.. బిగ్ బాస్‌పై సంచలన పోస్ట్ పెట్టిన సందీప్

by sudharani |
నీకు నచ్చిన వాళ్లకే కప్పు ఇచ్చుకో ఓటింగ్ ఎందుకు.. బిగ్ బాస్‌పై సంచలన పోస్ట్ పెట్టిన సందీప్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి దిగ్విజయంగా అడుగుపెట్టారు హౌస్ మేట్స్. అయితే.. 11 వారం అంటే ఆదివారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కావాలి. కానీ, అనూహ్య రీతిలో నిన్న నో ఎలిమినేషన్ అయింది. అంటే ప్రిన్స్ యావర్ తన ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేసిన కారణంగా.. గత వారం ఎలిమినేషన్ ఆపేసినట్లు నాగార్జున ప్రకటించాడు. దీనిపై నెట్టింట సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. కావాలనే ఎలిమినేషన్ ప్రోసస్ ఆపేశారు. లేకుంటే నిన్న శోభశెట్టి ఎలిమినేట్ కావాల్సి ఉంది. గత కొన్ని వారాలుగా కావాలనే బిగ్ బాస్ శోభ శెట్టిని సేవ్ చేస్తున్నారని నెట్టింట హాట్ హాట్‌గా న్యూస్ వైరల్ అవుతూనే ఉంది.

ఈ వారం కచ్చితంగా శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. కానీ, ఈ వారం ఏకంగా ఎలిమినేషన్‌నే ఎత్తేశారు. దీంతో చాలా మంది ఓటింగ్ అంతా డ్రామా. బిగ్ బాస్‌లో అంతా ఓ స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆట సందీప్ పెట్టిన పోస్ట్ మరింత రచ్చకు దారి తీసింది. ఈ మేరకు ‘ఏమయ్యా బిగ్ బాస్.. జనాల ఓట్లు లెక్క లేనప్పుడు ఎందుకయ్య ఓటింగ్ సిస్టమ్ పెట్టడం. నీకు నచ్చిన కంటెస్టెంట్‌ను సేవ్ చెయ్యడానికా. జనాలు ఏమైనా పిచ్చోల్లా. డిజర్వ్ కంటెస్టెంట్ అయిన సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయినప్పుడు ఎందుకు ఎలిమినేషన్ తీసేయ్యలేదు. యావర్ ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేశాడని ఎలిమినేషన్ తీసేశాం అని చెప్తున్నారు. ఇదేం తుప్పాస్ రీజన్’ అంటూ ఆ నోట్‌లో ఉంది. అయితే.. అది సందీప్ పెట్టాడో లేదో తెలియదు కానీ, ఆయన పేరు మీద అకౌంట్‌తోనే ఈ స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది.Next Story

Most Viewed