‘హోస్ట్‌గా నాగార్జున వేస్ట్’.. ఆయన చేయలేని పని నేను బజ్‌లో చేస్తున్న.. గీతూ రాయల్ కామెంట్స్ వైరల్

by sudharani |
‘హోస్ట్‌గా నాగార్జున వేస్ట్’.. ఆయన చేయలేని పని నేను బజ్‌లో చేస్తున్న.. గీతూ రాయల్ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: గత సీజన్లతో పోల్చితే బిగ్ బాస్ సీజన్ 7 చాలా సక్సెస్ అయింది. ఉల్టా పుల్టా అంటూ వచ్చిన ఈ సీజన్‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే.. బిగ్ బాస్ ఎంత హిట్ అయిందో దానికి సమానంగా బిగ్ బాస్ బజ్ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతు రాయల్.. బజ్‌కి హోస్ట్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న గీతూ.. నాగార్జున హోస్టింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.


ఆమె మాట్లాడుతూ.. ‘హోస్ట్‌గా నాగార్జున ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే.. అప్పటి వరకూ నాగార్జునకు కూడా స్క్రిప్ట్ వస్తుందని నాకు తెలియదు. ఆయనే ఎపిసోడ్ చూసి హోస్ట్ చేస్తారని నేను అనుకున్నా. నేను ఉన్న సీజన్‌లో కూడా అలాగే జరిగింది. నాకు చండికి గొడవ అయినప్పుడు నా తప్పు ఏం లేకపోయిన.. నాగార్జున మాత్రం నాదే తప్పు అని ఒప్పించడానికి ట్రై చేశారు. అదంతా స్క్రిప్ట్ అని నాకు తరువాత తెలిసింది. ఒక హోస్ట్‌గా షో చూసి.. ఏది తప్పు.. ఏది ఒప్పు అని ఆయన తన అభిప్రాయాన్ని చెప్తే బాగుండేది కానీ.. ఆయన అలా చేయలేదు. నా విషయంలోనే కాదు.. ఇలా చాలా మంది కంటెస్టెంట్ల విషయాల్లో అదే జరిగింది. ఒక రివ్యూవర్‌గా నాకు ఏమనిపించేదంటే.. ఆయనేదో అడుగుతారు.. కడుగుతారు.. బెండుతీస్తారనుకుంటే.. ఆయన కూల్‌గా వచ్చి.. హాయ్ హలో అని మాట్లాడేవారు. ఎవరైనా తప్పు చేస్తే కూడా దాన్ని ఖండించేవారు కాదు. ఆయన ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటీ అనేది మొత్తం.. స్క్రిప్ట్‌పై ఆధారపడి ఉంటుంది. ఇక ఒక హోస్ట్‌గా అన్ని పాయింట్లను కవర్ చేయడం కష్టమే కాబట్టి.. నేను బిగ్ బాస్ బజ్ హోస్ట్‌గా.. నాగార్జున అడగలేకపోయిన వాటిని నేను అడుగుతున్నాను. ఆడియన్సే నాకు చాలా ప్రశ్నలు పంపుతారు. నేను వాటినే కంటెస్టెంట్స్‌ని అడిగేదాన్ని. నా బజ్ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ తీసుకుంటున్నా.. ఆడియన్స్‌కి క్లారిటీ ఇప్పిస్తున్నా. నాకు ఒక్కసారి హోస్ట్‌గా అవకాశం వస్తే చాలని అనుకున్నా.. వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. బిగ్ బాస్ సీజన్ 7 కి హోస్ట్‌గా నాగార్జున వేస్ట్ అని, సీరియల్ బ్యాచ్‌కు సపోర్ట్‌గా మాట్లాడతారని నెట్టింట కామెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే.

Next Story