- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Bigg Boss-7: ఈ వారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. గత వారం డబుల్ ఎలిమినేషన్ కాగా.. ఈ వారం నామినేషన్‌లో అమర్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులు (అర్జున్, పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంక, గౌతమ్) అందరూ ఉన్నారు. ఇక గత వారంలో పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకోగా.. ఈ వారం ‘ఫినాలే అస్త్ర’ ఎంతో రసవత్తరంగా మారింది. పాయింట్ల బోర్డ్ ఇచ్చి ఎవరు అయితే.. ఎక్కువ పాయింట్లు సంపాదించుకుని మొదటి స్థానంలో ఉంటారో వారు ‘ఫినాలే అస్త్ర’కు అర్హులు అని చెప్పాడు బిగ్ బాస్. ఇక రెండు మూడు రౌండ్‌ల తర్వాత శివాజీ, శోభాశెట్టి ఓడిపోగా.. వారి పాయింట్లు అమర్‌కు వెళ్లి టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత ప్రియాంక ఓడిపోయి ఆ పాయింట్లు గౌతమ్‌కు ఇచ్చింది.
ఇలా యావర్ పాయింట్లు ప్రశాంత్‌కు.. మళ్లీ గౌతమ్ పాయింట్లు అమర్‌కు వచ్చి.. టాప్‌లో అమర్, పల్లవి ప్రశాంత్, అర్జున్ నిలిచారు. ఇక ఫైనల్‌గా అమర్‌ని, ప్రశాంత్‌ని ఓడించి ‘ఫినాలే అస్త్ర’ గెలుచుకున్నాడు అర్జున్. ఇదిలా ఉంటే.. ఈ వారం ఓటింగ్ టైం పూర్తి కాగా ఎవరూ ఎలిమినేట్ అయ్యారు అనేది చూద్దాం. ఇప్పటికే అర్జున్ ‘ఫినాలే అస్త్ర’ సొంతం చేసుకోవడంతో ఈవారం ఎలిమినేషన్‌ను నుంచి సేవ్ అవ్వడంతో పాటు మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఇక మొదట ప్రశాంత్, శివాజీ సేఫ్ అవ్వగా.. తర్వాత యావర్, ప్రియాంక అయినట్లు టాక్. తర్వాత శోభా శెట్టి, గౌతమ్ డేంజర్ జోన్‌లో ఉండటంతో.. పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న ‘ఎవిక్షన్ పాస్’తో శోభాను సేవ్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో గౌతమ్ ఈ వారం ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చాడని సమాచారం.