రామ్‌లల్లాను దర్శించుకున్న విరాట్ కోహ్లీ దంపతులు.. (ఫొటోలు వైరల్)

by Shiva |
రామ్‌లల్లాను దర్శించుకున్న విరాట్ కోహ్లీ దంపతులు.. (ఫొటోలు వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్ : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, బాల రాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి నిర్వాహకులు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, క్రీడాకారులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. ఈ క్రమంలోనే ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట క్రతువు భక్తుల జయజయధ్వానాల నడుమ వైభవోపేతంగా కొనసాగింది. అయితే, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షేంచేందుకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మోస్ట్ అగ్రెస్సివ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సతీసమేతంగా హాజరయ్యారు. శ్రీరామ నమా స్మరణ చేస్తూ.. ప్రాణ ప్రతిష్ట కొనసాగినంత సేపు వారు ధ్యానంలో మునిగిపోయారు. అనంతరం రామ మందిరం వద్ద విరాట్, అనుష్క కలిసి దిగిన ఫొటోను కింగ్ కోహ్లీ తన X (ట్విట్టర్) ఖాతాలో ‘బోలో సియావర్.. రామచంద్ర కీ జై’ అంటూ ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed