తోటలో రాత్రిపూట ఆ పని.. సడెన్‌గా వచ్చి షాకిచ్చిన పోలీసులు

120
arrest-poker-players1

దిశ, ములకలపల్లి: పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..  తల్లపాయ పంచాయితీ పరిధిలోని మంగలిగుట్ట గ్రామంలోని జీడీ తోటలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై పోలీసులు దాడిచేసి 9 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అదేవిధంగా 4 బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారని, సుమారు 40 మంది వరకు అక్కడి నుంచి పరార్ అయినట్లు సమాచారం.