ఉమ్మడి నిజామాబాద్‌లో 89 పాజిటివ్ కేసులు

by  |
ఉమ్మడి నిజామాబాద్‌లో 89 పాజిటివ్ కేసులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కరోనా పంజా విసిరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కేసులు రెండు జిల్లాలో నమోదు అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 40 పాజిటివ్, నిజామాబాద్ జిల్లాలో 49 కేసులు వెలుగు చూశాయి. కోవిడ్ కేసులలో నిజామాబాద్ జిల్లాను కామారెడ్డి జిల్లా త్వరలోనే దాటే పరిస్థితులు కనబడుతున్నాయి. శనివారం కామారెడ్డి పట్టణంలో 23 పాజిటివ్ కేసులు రాగా ఎల్లారెడ్డి 4, తాడ్వాయిలో 4 కేసులు మిగిలిన కేసులు ఆరు ప్రాంతాల్లో కేసులు వచ్చాయని వైద్యాధికారులు తెలిపారు. బాన్సువాడకు చెందిన 60ఏండ్ల వ్యక్తి నిజామాబాద్ కోవిడ్ ఆసుపత్రిలో చనిపోయారు. కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీపీ ద్వారా 276 పాజిటివ్ కేసులను గుర్తించగా, రాపిడ్ యాంటిజన్ టెస్టుల ద్వారా 16 కేసులను గుర్తించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 30 కేసులకు పైగా నమోదు కాగా బోదన్, ధర్పల్లి, జక్రాన్‌పల్లి, డిచ్‌పల్లిలో మిగితా కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో ఒక వ్యక్తి కరోనాతో చనిపోయారు. నిజామాబాద్ జిల్లాలో 356 పాజిటివ్ కేసులు కాగా, కామారెడ్డి జిల్లాలో 270 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.

Next Story

Most Viewed