చెరువు కట్ట తెగి 8మంది గల్లంతు

17

దిశ, వెబ్‎డెస్క్ : గత మూడు రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని పల్లె చెరువు కట్ట తెగిపోయింది. దీంతో చెరువు లోతట్టు ప్రాంతమైమన మైలార్ దేవుపల్లి అలీనగర్‎లో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికీ రెండు మృతదేహాలు లభ్యమవ్వగా.. మిగతా వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పల్లె చెరువు కట్ట పూర్తిగా తెగితే అలీనగర్, అల్ జుబేల్ కాలనీ పూర్తిగా నీట మునిగే ప్రమాదం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.