7H మీడియా ప్రీమియర్ లీగ్‌ అప్‌డేట్స్.. తొలి రోజు విజేతలు వీరే..!

by  |
7H మీడియా ప్రీమియర్ లీగ్‌ అప్‌డేట్స్.. తొలి రోజు విజేతలు వీరే..!
X

దిశ, వెబ్‌డెస్క్: నందిని టైర్స్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న 7H మీడియా ప్రీమియర్ లీగ్ సెకండ్ సీజన్‌ టీ20 మ్యాచ్‌లు.. హైదరాబాద్ నగరశివారు దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ మైదానంలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కరోనాతో అమరులైన విలేకరులను తలుచుకుంటూ మౌనం పాటించి ఈ లీగ్‌ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మర్రి లక్ష్మణ్ రెడ్డి, నందిని టైర్స్ ఎండీ భరత్ రెడ్డి, ఎంఎల్‌ఆర్ ఇన్‌చార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆర్గనైజర్ వెంకటేష్‌లు కలిసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. తొలి రోజు రెండు మ్యాచులు జరిగాయి. తొలి మ్యాచ్‌లో DC వర్సెస్ V6, సెకండ్ మ్యాచ్‌లో వెలుగు వర్సెస్ TV 9 జట్లు తలపడ్డాయి. ఇందులో V6, TV9 విజేతలుగా నిలిచాయి.

తొలి మ్యాచ్ వివరాలు

టాస్​గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న V6 జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్​సదా 51 (36 బంతుల్లో 8×4, 1×6) అర్థ సెంచరీతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడు శ్రవణ్​40 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు. DC జట్టు బౌలింగ్‌లో నాగరాజు, మధు రెండేసి వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్​ చేపట్టిన DC జట్టు లక్ష్యాన్ని చేధించలేక16.4 ఓవర్లలో 91 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. లోయర్ ఆర్డర్‌ ఆటగాడికి గాయం కారణంగా విన్ డిక్లేర్డ్ ప్రకటించింది. ఇక V6 జట్టులో ప్రేమ్​ 3/20, శ్రీకాంత్, మదార్​రెండేసి వికెట్లు తీశారు. మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్‌గా సదా(51) నిలిచాడు.

TV9 ఘన విజయం

ఇక మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్‌లో వెలుగుపై TV9 జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్​ గెలిచి బ్యాటింగ్​ఎంచుకున్న వెలుగు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్​ చేపట్టిన TV9 జట్టు కేవలం 8.2 ఓవర్లలోనే ఒక్క వికెట్​కూడా నష్టపోకుండానే ఘన విజయం సాధించింది. ఓపెనర్​ వాసు (51నాటౌట్, 10×4, 1×6​) 34 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసి జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు. మరో ఓపెనర్ నబి (27 నాటౌట్, 2×4, 1×6) రాణించాడు. మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్‌గా వాసు నిలిచాడు.


Next Story

Most Viewed