ఏడుగురు మావోయిస్టుల లొంగుబాటు

by  |
ఏడుగురు మావోయిస్టుల లొంగుబాటు
X

దిశ, కరీంనగర్:
చత్తీస్‌ గఢ్‌ రాష్ట్రంలోని దండకారణ్యం అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన ఏడుగురు నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 2017 ఏప్రిల్ 25న సుక్మా జిల్లా బుర్కాపాల్, చింతగుఫా వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో పాల్గొన్న వారిలో ఏడుగురు మావోయిస్టులు మంగళవారం సుక్మా జిల్లాలోని సీఆర్పీఎఫ్ బెటాలియన్స్ ముందు లొంగిపోయారు. వీరంతా కుంట ఏరియా కమిటీలో దళ సభ్యులుగా పనిచేస్తున్నారు. ఏరియా కమిటీ కమాండర్ కోసా అంగ రక్షకులుగా పనిచేస్తున్న ఇద్దరు కూడా లొంగిపోయినట్టు సీఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు.

Next Story

Most Viewed