695 సీనియర్​ వైద్యులకు పోస్టింగ్​లు

73

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా 695 మంది సీనియర్ రెసిడెంట్లకు వైద్యశాఖ పోస్టింగ్ లు ఇచ్చింది. వేర్వేరు దవాఖాన్లలో పనిచేసేందుకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ​డా.రమేశ్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్​ నిబంధనల ప్రకారం వైద్య విభాగంలో పీజీ పూర్తయిన తర్వాత, ఏడాది పాటు సీనియర్ రెసిడెంట్‌గా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. దీంతో ఈ ఏడాది పీజీ పూర్తి చేసుకున్న డాక్టర్లకు అధికారులు కౌన్సిలింగ్​ నిర్వహించారు. మెరిట్ ప్రకారం తుది జాబితాను తయారు చేసి పోస్టింగ్స్‌ ఇచ్చారు. అయితే వీరిలోని కొందరిని కొత్తగా అందుబాటులోకి రాబోతున్న 8 మెడికల్ కాలేజీల్లోనూ భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు. నవంబర్ ఫస్ట్ నుంచే వీరంతా విధుల్లోకి చేరాలని వైద్యశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..