చెన్నూర్‌లో మరో 6 పాజిటివ్ కేసులు

by  |
చెన్నూర్‌లో మరో 6 పాజిటివ్ కేసులు
X

దిశ ,చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ 20 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీలో 2, ఎస్సీ కాలనీలో 1, చర్చ్ రోడ్డులో 1, గేరేకాలనీలో 1, అంతేగాకుండా మండలంలోని దుగునేపల్లిలో ఒక కేసు నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు స్పష్టం చేశారు.

Next Story

Most Viewed