నమ్మి చేరదీస్తే నట్టేట ముంచాడు.. డ్రైవర్‌గా చేరి రూ.50 లక్షలు చోరీ

by  |
DCP Venkateshwarlu
X

దిశ, గచ్చిబౌలి: నమ్మి చేరదీసి ఆశ్రయం కల్పిస్తే నట్టేట ముంచాడో డ్రైవర్. అన్నం పెట్టిన యజమానులకు కన్నం వేసి రూ.50 లక్షలతో పరారైన ప్రబుద్ధుడిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. ధీరజ్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతని వద్ద ఇటీవలే హనుమంత్ దోత్రే అనే వ్యక్తి డ్రైవర్‌గా చేరాడు. ఈ క్రమంలో ధీరజ్ రెడ్డి తమ వ్యాపార సహచరులతో కలిసి డ్రైవర్‌‌ను హనుమంత్‌ను తీసుకొని మాదాపూర్ వెళ్లాడు.

కారులో రూ.50 లక్షల నగదును వ్యాపార నిమిత్తం తీసుకెళ్లారు. చిన్న పనినిమిత్తం ధీరజ్ కారు దిగడంతో ఇదే అదునుగా భావించిన డ్రైవర్ హనుమంత్ రూ.50 లక్షలతో పరారయ్యాడు. అనుమానం వచ్చిన ధీరజ్‌ హనుమంత్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం మూడు బృందాలు ఏర్పడి గాలిస్తున్నారు. చివరకు కాల్ డేటా ఆధారంగా జహీరాబాద్ మెయిన్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించగా డబ్బు తీసుకొని పరారయినట్టు ఒప్పుకున్నాడు. అందులో రెండు లక్షలు ఇంటి ఖర్చుల నిమిత్తం వాడుకున్నట్టు తెలిపారు. మిగతా డబ్బును పోలీసులకు అప్పగించాడు.

Next Story

Most Viewed