అప్రెంటిస్‌లను పెంచనున్న భారత కంపెనీలు.. ఎందుకంటే ?

by  |
jobs
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని దాదాపు 45 శాతం కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అప్రెంటిస్‌ల నియామకాలను చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. నైపుణ్యాల కొరతను తగ్గించేందుకు, కొవిడ్ మహమ్మారి కారణంగా తగ్గిన కార్మికులను భర్తీ చేసేందుకు కంపెనీలు ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఓ సర్వే వెల్లడించింది. టీమ్‌లీజ్ సంస్థ ‘2021, హెచ్2 అప్రెంటిషిప్ ఔట్‌లుక్ రిపోర్ట్’ ప్రకారం.. సర్వేలో పాల్గొన్న 45 శాతం కంపెనీల యజమానులు జూలై-డిసెంబర్ మధ్య అప్రెంటిస్‌ల నియామకాలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశాయి. ఇది జనవరి-జూన్ మధ్య కాలంతో పోలిస్తే 4 శాతం అధికమని టీమ్‌లీజ్ నివేదిక తెలిపింది. ఇందులో 64 శాతం కంపెనీలు తమకున్న ప్రస్తుత అప్రెంటిస్‌ల కంటే మరింత ఎక్కువమందిని తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇది జనవరి-జూన్ మధ్య తీసుకున్న వారికంటే ఎక్కువమందిని తీసుకోవాలని చూస్తున్నాయి.

మొత్తం 18 రంగాల్లోని 833 కంపెనీల నుంచి సేకరించిన వివరాలను టీమ్‌లీజ్ సంస్థ తన నివేదికలో అభిప్రాయాలను పొందుపరించింది. ‘ఈ ఏడాది కొవిడ్ సంక్షోభం వల్ల ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ అప్రెంటిస్‌లను పెంచాలని కంపెనీలు అనుకుంటున్నాయి టీమ్‌లీజ్ స్కిల్ యూనివర్శిటీ వైస్-ప్రెసిడెంట్ సుమిత్ అన్నారు. ఇందులో ఇంజనీరింగ్ పరిశ్రమలో 68 శాతం, రిటైల్ 58 శాతం, ఆటో పరిశ్రమ, దాని అనుబంధ పరిశ్రమల్లో 58 శాతం అప్రెంటిస్‌ల పెంపు ఉండనుంది. గత అర్ధ సంవత్సర కాలంతో పోలిస్తే 13 శాతం బలమైన వృద్ధిని తయారీ, ఇంజనీరింగ్ పరిశ్రమలున్నాయి.



Next Story

Most Viewed