ఫ్లాష్ ఫ్లాష్ : పిల్లాడిని కాపాడబోయి బావిలో పడ్డ 30 మంది.. నలుగురు మృతి

by  |
well
X

దిశ, వెబ్‌డెస్క్ : పిల్లాడిని కాపాడేందుకు వెళ్ళి ప్రమాదవశాత్తు 30 మంది వ్యవసాయ బావిలో పడిపోయారు. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందగా, 19 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా గంజ్‌బసోడ గ్రామంలో గురువారం రాత్రి వెలుగుచూసింది. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. అందులో 20 అడుగుల మేర నీరు ఉంది. బాలుడు పడిపోయిన విషయం తెలియగానే కొంతమంది స్థానికులు బావిలోకి దిగి అతన్ని రక్షించే ప్రయత్నంచేశారు. మరికొందరు బావి గొడ దగ్గర నిలబడి ఉండగా.. ఒక్కసారిగా అది కూలిపోవడంతో ఒకరి తర్వాత ఒకరు అందరూ బావిలో పడిపోయారు. రక్షణ చర్యల కోసం తీసుకొచ్చిన ట్రాక్టర్ కూడా భూమి కుంగడంతో ప్రమాదవశాత్తు బావిలో పడింది. ఈ క్రమంలోనే నలుగురు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో రక్షణ చర్యలు చేపట్టారు. మొత్తం 19 మందిని బావి నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల్లో భాగంగా బావిలో నలుగురి మృతదేహాలు లభ్యం కాగా పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, నిన్న రాత్రంతా సహాయక చర్యలు కొనసాగినట్లు సమాచారం.

నష్టపరిహారం..

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించడమే కాకుండా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.

Next Story