ఏపీలో మరో కరోనా పాజిటివ్

by  |

ఏపీలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరింది. విశాఖకు చెందిన 65 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఇటీవల సదరు వ్యక్తి మక్కా వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం ఆయన విశాఖ చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, మొదటి కరోనా కేసు నెల్లూరులో నమోదు కాగా, మరొక్కటి ఒంగోలులో నమోదు అయింది. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. నేడు సీఎం జగన్ కరోనాపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

Tags: corona, another positive case, registered, ap news

Next Story

Most Viewed