భారత్‌కు చేరిన 3 రఫేల్ యుద్ద విమానాలు

by  |
Rafale fighter jets
X

దిల్లీ: భారత వాయుసేనలో మరో మూడు రఫేల్ యుద్దవిమానాలు చేరాయి. నాలుగో దశలో భాగంగా ఈ రఫేల్ యుద్ద విమానాలను భారత్‌కు ఫ్రాన్స్ పంపింది. ఫ్రాన్స్ నుంచి బుధవారం ఉదయం బయలు దేరిన యుద్ధవిమానాలు నేరుగా రాత్రి భారత్‌కు చేరకున్నాయి. కాగా యుద్ధ విమానాలకు మార్గమధ్యలో మిడ్ ఎయిర్ రిఫిల్లింగ్ విధానంలో యూఏఈకి చెందిన విమానం ఇంధనాన్ని సమకూర్చినట్టు ఏయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. తాజాగా మూడు రఫేల్ యుద్ద విమానాల చేరికతో వీటి సంఖ్య 14కు చేరింది. దీంతో భారత వాయుసేన మరింత పటిష్టంగా మారినట్టు వాయుసేన పేర్కొంది. అయితే ఈ విమానాలు ఎక్కడ ల్యాండ్ అయ్యాయి అనే విషయాన్ని మాత్రం వాయుసేన వెల్లడించలేదు.



Next Story

Most Viewed