నర్సులకు 3 నెలల అడ్వాన్స్ జీతం ఇవ్వడానికి రెడీ : బండి సంజయ్

by  |
నర్సులకు 3 నెలల అడ్వాన్స్ జీతం ఇవ్వడానికి రెడీ : బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని కరోనా రోగులకు వైద్యం అందించేందుకు వైద్యులు, నర్సులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిని ఎంపీ బండి సంజయ్ సందర్శించారు. ఆస్పత్రిలోని రోగులకు వైద్య సేవలు అందించేందుకు నర్సుల కొరత ఉండంటంతో అక్కడి వైద్యులపై సీరియస్ అయ్యారు. విపత్కర పరిస్థితుల్లో రిక్రూట్ మెంట్ చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తాత్కాలిక ప్రాతిపదికపై 20 మంది నర్సులను వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే వారికి మూడు నెలల వేతనాన్ని ముందుగానే చెల్లించడానికి తాను రెడీ అని బండి సంజయ్ వెల్లడించారు. అంతేకాకుండా 24గంటలు రోగుల సేవలో నిమగ్నమైన ఆరోగ్యశాఖ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ ప్రకటించాలన్నారు. వీరికి సాయం అందించేందుకు కేంద్రం కూడా సిద్ధంగా ఉందన్నారు. కొవిడ్ వ్యాప్తి ఎక్కువ అవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.


Next Story

Most Viewed