22 వేల మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా : డబ్ల్యూహెచ్‌ఓ

by  |
22 వేల మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా : డబ్ల్యూహెచ్‌ఓ
X

కరోనా పేషెంట్లను గుర్తించడం, వారిని ఆస్పత్రులకు చేర్చడం, రోగికి సరైన చికిత్స అందించి కోలుకునేలా చేయడంలో ఆరోగ్య కార్యకర్తలది ప్రధాన భూమిక. ఇలా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా బాధితుల సేవలో నిమగ్నమై ఉన్నారు. కాగా, 52 దేశాల్లో 22,073 మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా వైరస్ బారిన పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. కరోనా సేవలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలపై జరిపిన సర్వేలో ఈ చేదు నిజం బయటపడినట్లు డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక చెప్పింది. పని చేస్తున్న ప్రదేశాలు, జన సమూహాలు, కుటుంబ సభ్యుల వల్లే ఎక్కువ మంది కరోనా బారిన పడినట్లు తెలిపారు. దీంతో వీళ్లందరికీ తగిన రక్షణ కల్పించాలని.. వారికి అవసరమైన మాస్కులు, గ్లౌజులు, గౌన్లు సమకూర్చాలని ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్‌వో ఆదేశించింది.

tags: coronavirus, WHO, infection, frontline warriors

Next Story

Most Viewed