ICC World Cup 2023: సెంచరీలతో చెలరేగిన శ్రేయాస్, కేఎల్ రాహుల్.. నెదర్లాండ్స్ టార్గెట్ ఇదే

by Vinod kumar |   ( Updated:2023-11-12 12:37:36.0  )
ICC World Cup 2023: సెంచరీలతో చెలరేగిన శ్రేయాస్, కేఎల్ రాహుల్.. నెదర్లాండ్స్ టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్‌లో 3 వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేసింది. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఇదే అత్యధికగా స్కోరు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతి బ్యాటర్‌ అర్థ సెంచరీ కంటే ఎక్కువే పరుగులు చేశారు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (54 బంతుల్లో 61, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (32 బంతుల్లో 51, 3 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ (56 బంతుల్లో 51, 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలకు తోడు శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌, 10 ఫోర్లు, 5 సిక్సర్లు), కెఎల్‌ రాహుల్‌ (64 బంతుల్లో 102, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) లు సెంచరీలతో కదం తొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌.. 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్‌లో.. పాల్ వాన్, రోల్‌ఫ్ వాన్, బాస్ డి లీడె చెరో వికెట్ తీశారు.

అర్థ సెంచరీల రికార్డు..

రోహిత్‌ శర్మ (61), శుభ్‌మన్‌ గిల్‌ (51), విరాట్‌ కోహ్లీ (51) అర్థ సెంచరీలకు తోడు శ్రేయస్‌ అయ్యర్‌ (128 నాటౌట్‌), కెఎల్‌ రాహుల్‌ (102) లు సెంచరీలతో చెలరేగారు. దీంతో వన్డేలలో భారత్‌ అరుదైన ఘనతను నమోదు చేసింది. వన్డేలలో ఇలా టాప్‌-5 బ్యాటర్లు హాఫ్‌ సెంచరీలు చేయడం ఇది నాలుగోసారి మాత్రమే. వరల్డ్‌ కప్‌ చరిత్రలో అయితే ఇదే తొలిసారి.

Advertisement

Next Story